![]() |
![]() |
బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్, పృద్వి ఇద్దరి మేల్ జోడి అద్భుతంగా ఉంటుంది. నిఖిల్ నల్ల కళ్లజోడుతో, పృద్వి గడ్డంతో వెనక జుట్టుతో కళ్లజోడుతో ఉంటాడు. వీళ్ళను కే బ్యాచ్ అని పిలుస్తారు. ఇక వీళ్లద్దరి ఫ్రెండ్ షిప్ కూడా వేరే లెవెల్ లో ఉంటుంది. ఐతే వీళ్ళు ఒక షో ఇంటర్వ్యూకి వచ్చారు. అందులో పృద్వి శెట్టి గురించి ఒక విషయం లీకైంది. "గడ్డం తీస్తేనే మూవీలో రోల్ ఇస్తానని రామ్ చరణ్ అంటే రోల్ ఏంటి అని అడిగావట ఏంటి" అంటూ హోస్ట్ తేజస్విని మాదివాడ అడిగేసరికి నవ్వేసాడు. దానికి నువ్వు నిజంగానే హీరో లాగా ఉన్నావ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసింది తేజస్విని. "నాకు ఇండస్ట్రీ మీద ఇంటరెస్ట్ రావడానికి కారణం నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ " అని చెప్పుకొచ్చాడు పృద్వి శెట్టి. తర్వాత నిఖిల్ ని అడిగింది .."ఎవరితోనైనా డేట్ చేయాలనుకుంటున్నావా" అని. "లేదు " అన్నాడు. "ప్యాచప్ లేదా బ్రేకప్" అని ఇంకో క్వశ్చన్ అడిగింది. ప్యాచప్ అని నిఖిల్ ఆన్సర్ ఇచ్చేసరికి ఎవరితో ప్యాచప్ చెప్పు అంటూ ఆతృతగా అడిగింది. 'హే వద్దులే ...నేను స్క్రాచ్ లోంచి వచ్చాను ఇప్పుడు ఇలా కాన్ఫిడెంట్ తో ఉన్నా. ఒకవేళా మళ్ళీ స్క్రాచ్ లో పడాల్సి వచ్చినా ఎలా లేవాలో నాకు బాగా తెలుసు..సరే నన్ను ఎవరైనా బ్లేమ్ చేస్తూ ఉంటూ వదిలేస్తా" అన్నాడు నిఖిల్. నిఖిల్ కి కావ్యకి మధ్య ఎం జరిగిందో అసలు విషయం తెలీదు కానీ ఇద్దరికీ షోస్ లో బాగా కోల్డ్ వార్ జరుగుతోంది. " నేను బిగ్ స్క్రీన్ ని షేర్ చేసుకోవాలి అనుకుంటే అల్లు అర్జున్ తో షేర్ చేసుకుంటా" అని చెప్పాడు నిఖిల్.
![]() |
![]() |